Sunday, May 19, 2024

సురక్షితమైన జీవితం కోసం వ్యాక్సిన్ ఎంతో అవసరం : ప్రియాంక శివశంకర్ గౌడ్

సురక్షితమైన జీవితం కోసం 15 నుండి 18 ఏళ్ళు నిండిన ప్రతి బాల బాలికలు కోవిడ్ టీకాను తీసుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొంది కోవిడ్ రహిత సమాజం కోసం కృషి చేయాల్సిన అవసరం నేటి యువతపై ఎంతైనా ఉందని ఎంపీపీ ప్రియాంక శివశంకర్ గౌడ్ అన్నారు. నందిగామ మండలం చేగుర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో బుధవారం సర్పంచ్ మామిళ్ల సంతోష విఠ‌ల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీపీ ప్రియాంక శివశంకర్ గౌడ్ పాల్గొని సర్పంచ్ తో కలిసి విద్యార్థులకు వ్యాక్సిన్ వేసి వ్యాక్సిన్ ప్రక్రియను ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు, బాల బాలికలు అపోహలు వీడి 15 నుండి 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు కోవిడ్ నివారణకు వ్యాక్సిన్ వేయించుకోవాలి సూచించారు. అదేవిధంగా భౌతిక దూరాన్ని పాటిస్తూ, మాస్క్ లు ధరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు ఎల్.రవి, ఏఎన్ఎం శమ, స్వరూప, ఆశావర్కర్, శివనిల, జంగయ్య, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement