Sunday, April 28, 2024

Accident – మేడ్చల్‌ ఓఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదం… ఇద్దరు మృతి

మేడ్చల్‌లోని ఓఆర్‌ఆర్ ఎగ్జిట్‌ 6 వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతి వేగంగా వచ్చిన కారు ఎదురుగా వస్తున్న ఇన్నోవాను ఢీ కొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. మృతులో ఒకరు వనస్థలిపురానికి చెందిన రెడ్డప్ప రెడ్డిగా గుర్తించినట్లు ఎస్‌ఐ నవీన్ రెడ్డి తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement