Monday, April 29, 2024

TS : మరో రెండు హామీలకు శ్రీకారం… చేవెళ్లలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ…

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారంటీలోని హామీల్లో మరో రెండింటిని నేటి నుంచి అమలు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని ఫరా ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో రెండు హామీల అమలు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు.

- Advertisement -

ఇక, గృహజ్యోతి పథకం కింద తెల్ల రేషన్ కార్డు దారులకు నెలకు 200 యూనిట్ల వరకూ ఫ్రీ కరెంట్ లభించనుంది. అలాగే తెల్లరేషన్ కార్డు ఉన్న లబ్దిదారులకు గ్యాస్ సిలిండర్ కేవలం 500రూపాయలకే ఇవ్వనున్నారు.అయితే, ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీ హామీల్లో ఇప్పటికే 2 అమలు చేసింది. ఒకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కాగా, రెండోది ఆరోగ్యశ్రీ లబ్దిని 5 లక్షల నుంచి 10లక్షల రూపాయలకు పెంచింది. రైతు భరోసా బదులు రైతు బంధును కొందరు రైతులకు ఇచ్చినా, ఆ పథకం ఇంకా పూర్తిగా అమలు కాలేదు. దీంతో ఇవాళ అమలు చేసే 2 పథకాలతో మొత్తం 4 పథకాలను కాంగ్రెస్ సర్కార్ అమలు చేసినట్లైతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement