Saturday, April 13, 2024

TS: రెండు బైక్ లు ఢీ.. ఇద్దరు యువకుల దుర్మరణం..

తిరుమలాయపాలెం : రెండు బైకులు ఢీకొని ఇద్ద‌రు యువ‌కులు దుర్మ‌ర‌ణం పాలైన ఘ‌ట‌న సోమవారం అర్ధ‌ త్రి తిరుమలాయపాలెం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఖమ్మం నుండి వరంగల్ వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం వరంగల్ వైపు నుండి ఖమ్మం వెళ్తున్న మరో ద్విచక్ర వాహనం తిరుమలాయపాలెం మండల కేంద్రంలో వరంగల్ జాతీయ రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు వేగంగా ఢీకొనడంతో అక్కడికక్కడే ఇద్దరు యువకులు మృతి చెందారు.

ఒక‌ మృతుడు ఖమ్మం ఖానాపురం హవేలీకి చెందిన షేక్ ముజాకీర్ (19), మరొక మృతుడు లారీ డ్రైవర్ మరిపెడ బంగ్లా బోడతండకు చెందిన బోడ రమేష్ (35) గా గుర్తించారు. అలాగే మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం పోలీసులు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆస్ప‌త్రికి తరలించారు. సంఘటన స్థలంలో మద్యం బాటిళ్ల‌ను గుర్తించిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement