Monday, April 29, 2024

Thula Uma : గులాబీ గూటికి తుల ఉమ‌


వేములవాడ బిజెపి నేత తుల ఉమా బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేర‌కు గులాబీ శ్రేణులు తుల ఉమాతో చ‌ర్చ‌లు జ‌రిపి బీఆర్ఎస్‌లో చేరేందుకు ఒప్పించారు. వేములవాడ బిజెపి నేత తుల ఉమాతో బిఆర్ఎస్ నేతలు రెండు గంటలకు పైగా చర్చలు జరిపారు. సిరిసిల్ల తెలంగాణ భవన్ వేదికగా వినోద్ కుమార్ తుల ఉమాతో మాట్లాడారు. ఆ తర్వాత బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఉమతో ఫోన్ లో మాట్లాడారు.

తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో తూల ఉమ చేర‌నున్నారు. వేములవాడలో బిజెపి అభ్యర్థిగా ప్రకటించిన తులా ఉమకు టికెట్ ఇచ్చి బీఫామ్ ఇవ్వకపోవడంతో అక్కడ రాజకీయం రసవత్తరంగా మారింది. వేములవాడ బరి నుంచి వికాస్ రావు బిజెపి అభ్యర్థిగా బరిలోకి దిగడంతో తుల ఉమ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement