Sunday, June 2, 2024

TSPSC – యాథాతథంగా గ్రూప్ వ‌న్ – ప‌రీక్ష తేదీల‌లో మార్పు లేదు

తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేసే ప్రసక్తే లేదని టీఎస్ పీఎస్సీ తేల్చి చెప్పింది. పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తిచేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. జూన్ 9న పరీక్ష నిర్వహించేందుకు జూన్ 1 నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునేందుకు చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదలైన వెంటనే లోక్‌సభ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఖమ్మం-వరంగల్-నల్లగొండ పట్టభద్రుల ఎన్నికలు వచ్చాయి. దీంతో గ్రూప్-1కి దరఖాస్తు చేసుకున్న వారిలో నిరుద్యోగులతో పాటు సర్వీసులో ఉన్న ఉద్యోగులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఇన్ సర్వీస్ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో తప్పనిసరిగా పాల్గొనాల్సి వచ్చిందని, నిరుద్యోగులదీ అదే పరిస్థితి ఎదుర్కొన్నారన్నారు.

ఎన్నిక‌ల నేప‌థ్యంలో రెండు నెల‌ల వాయిదా

ఎన్నికల నేపథ్యంలో పరీక్షలకు సిద్ధం కాలేదని, గ్రూప్-1 అభ్యర్థులు కనీసం రెండు నెలలపాటు ప్రిలిమినరీ పరీక్షలను వాయిదా వేసి తమకు న్యాయం చేయాలని టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌, సెక్రటరీని అభ్యర్థించారు. బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చటారి దశరథ్‌ మాట్లాడుతూ.. గ్రూప్‌-1 పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించారు. అయితే ప‌రీక్ష‌లు వాయిదాకు తిర‌స్క‌రించింది.

- Advertisement -

536 పోస్ట్ ల‌కు ప‌రీక్ష‌లు..

మరోవైపు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ విభాగాల్లో మొత్తం 536 ఖాళీల కోసం గ్రూప్ 1 స్థానాలకు రాత పరీక్షను నిర్వహిస్తుంది. ఈ పరీక్ష 9 జూన్ 2024న రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేంద్రాలలో జరగనుంది, పరీక్ష వ్యవధి మూడు గంటలు ఉంటుంది. తమ దరఖాస్తు ఫారమ్‌ను విజయవంతంగా సమర్పించిన అభ్యర్థులు గ్రూప్ 1 పరీక్షకు హాజరు కావచ్చు. దరఖాస్తు ఫారమ్‌ను విజయవంతంగా సమర్పించిన అభ్యర్థులు తమ గ్రూప్ 1 హాల్ టిక్కెట్‌ను పరీక్ష తేదీకి ముందు అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు ఈ హాల్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేసి, పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాలి, ఎందుకంటే ఇది పరీక్షకు కూర్చోవడానికి వారి అర్హతను ధృవీకరిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement