Monday, December 9, 2024

Constable Suicide – ఏఆర్ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

అన్నమయ్య జిల్లా రాయచోటిలోని ఎస్పీ కార్యాలయంలో ఏఆర్ మహిళా కానిస్టేబుల్ వేదవతి (29) ఆత్మహత్య చేసుకుంది. ఎస్పీ కార్యాలయంలోని సెక్యూరిటీ గార్డ్ రూమ్‌లో తన వద్ద ఉన్న సర్వీస్ తుపాకితో కాల్చుకొని ఏఆర్ మహిళా కానిస్టేబుల్ వేదవతి ఆత్మహత్య చేసుకుంది.

గత కొంతకాలంగా ఎస్పీ కార్యాలయంలో సెక్యూరిటీ గార్డుగాఏఆర్ మహిళా కానిస్టేబుల్ వేదవతి విధులు నిర్వర్తిస్తోంది. ఆత్మహత్య ఘటనపై పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement