Tuesday, April 16, 2024

TS – కారు, బైక్‌ ఢీ – ముగ్గురి దుర్మరణం

మెదక్ – కారు, బైక్‌ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ ఘటన మెదక్‌ జిల్లా అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్‌ వద్ద సోమవారం రాత్రి జరిగింది. నాందేడ్‌ అకోలా 161వ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆ యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నది.

అయితే, ఒకే బైక్‌పై నలుగురు యువకులు జాతీయ రహదారిపై రాంగ్‌ రూట్‌లో వెళ్తూ కారును ఢీకొట్టారు. మృతులను పాపన్నపేట మండలం బాచారం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement