Wednesday, April 17, 2024

TS – పెద్దపల్లిలో ఆపరేషన్‌ గరుడ – రామగుండం సీపీ శ్రీనివాస్‌

పెద్దపల్లి, ఫిబ్రవరి 28 (ప్రభన్యూస్‌): అసాంఘీక శక్తుల నిర్మూలనకు పెద్దపల్లిలో ప్రయోగాత్మకంగా ఆపరేషన్‌ గరుడ మొదలు పెడతామని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ ఎం. శ్రీనివాస్‌ తెలియజేశారు. బుధవారం పెద్దపల్లి పోలీస్‌ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లో రికార్డులను పరిశీలించారు. జిల్లా కేంద్రంతోపాటు గ్రామాల్లో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ జిల్లా కేంద్రంతోపాటు శివారు ప్రాంతాల్లో అసాంఘీక కార్యకలాపాలు జరగకుండా ఉండెదుకు ఆపరేషన్‌ గరుడ పేరిట డ్రోన్‌లతో ప్రత్యేక నిఘా ప్రారంభిస్తామన్నారు.

పెద్దపల్లిలో విజయవంతమైతే కమిషనరేట్‌ వ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. సమస్యలతో పోలీస్‌ స్టషన్‌కు వచ్చే ప్రజలకు సత్వర న్యాయం చేసేలా అధికారులు పని చేయాలన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ పక్కాగా అమలు చేయడంతోపాటు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారిపట్ల కఠినంగా వ్యవహరి చాలన్నారు. మహిళల రక్షణకు పెద్దపీట వేస్తామని, షీ టీమ్‌లు, బ్లూకోట్స్‌ టీమ్‌లు 24 గంటలపాటు పని చేస్తాయన్నారు. పెట్రోలింగ్‌ ముమ్మరంగా కొనసాగిస్తామన్నారు. ఈకార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ చేతన, సీఐ కృష్ణ, ఎస్‌ఐ లక్ష్మణ్‌రావుతోపాటు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement