Sunday, April 28, 2024

వైద్యారోగ్య శాఖ, ఆయుష్‌ విభాగాల్లో 156 వైద్యుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ వెద్యారోగ్య శాఖలో కొలువుల జాతర కొనసాగుతున్నది. తాజాగా, 156 వైద్యుల పోస్టుల భర్తీకి రాష్ట్ర మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆయుర్వేదం 54, హోమియో 33, యునాని 69 విభాగాలతో కలిపి మొత్తం 156 మంది వైద్యులను మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నియమించనుంది. ఆగస్టు 7 నుంచి 22 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. పూర్తి వివరాల కోసం.

ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బి.తెలంగాణ.జివోవి.ఇన్‌ వెబ్‌సైట్‌ సందర్శించాలని బోర్డు వెల్లడించింది. కాగా, మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ చేపట్టనున్న ఖాళీల భర్తీని వైద్యులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు ట్టిట్వర్‌ ద్వారా పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement