Sunday, October 6, 2024

TS- అనాధ పిల్లలకు నీలం మధు అపన్నహస్తం…

గజ్వేల్ ఫిబ్రవరి 19 ప్రభ న్యూస్ – గజ్వేల్ నియోజకవర్గం గజ్వేల్ మండలం కోల్గూరు గ్రామానికి చెందిన నీరుడి భాస్కర్ డ్రైవర్ గా పనిచేస్తూ మరొక పక్క మాస్కురిగా పనిచేసేవాడు. అయితే ఏడాదిన్నర క్రితం అనారోగ్యంతో మరణించాడు. భాస్కర్ కు భార్య కవిత తో పాటు ముగ్గురు పిల్లలున్నారు, భాస్కర్ మరణించడంతో పిల్లలకు కవిత అన్ని తానై వ్యవహరిస్తూ మస్కురిగా ఉద్యోగం చేస్తూ పిల్లల్ని పోషించుకుంటున్న‌ది. అయితే విధి ఆడిన వింత నాటకంలో కవిత సైతం తీవ్ర ఆనారోగ్యంతో కన్నుమూసింది.
దీంతో ముగ్గురు పిల్లలు కావ్య(6), శ్రీ వాణి(4), కుమార్(18 నెలలు) అనాధలై రోడ్డున పడ్డారు, కవిత కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉండడంతో పిల్లల పోషణ ఇబ్బందిగా మారింది.సంవత్సరం వ్యవధిలో తల్లి దండ్రులను కోల్పోయి దిక్కు తోచని స్థితిలో ఉన్న ముగ్గురు చిన్నారులకు కాంగ్రెస్ రాష్ట్ర నేత నీలం మధు ముదిరాజ్ అండగా నిలబడి సోమవారం గజ్వెల్ మండలం కొల్గూర్ లో చిన్నారులను పరామర్శించి అండగా ఉంటానని ఆపన్న హస్తం అందించారు.

అనాధలుగా మారిన ముగ్గురు చిన్నారులకు ఆర్థిక సహాయం అందించి తన మంచి మనసుని మరోమారు చాటుకున్నారు.
ముగ్గురు పిల్లలు అనాధలై తీవ్ర కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిన నీలం మధు పరిస్థితి విని చలించి
ఆ పిల్లలకు అండగా నిలబడాలని నిర్ణయించుకుని పెద్ద మనసుతో ఒక్కొక్కరికి 50 వేల చొప్పున ముగ్గురికి కలిపి రూ. లక్ష యాబై వేలు పిల్లల పేర్లపైన ఫిక్స్ డిపాజిట్ చేశారు. అంతే కాకుండా పిల్లల బాగోగులు చూసుకోవడానికి తక్షణ ఖర్చుల కింద మరొక యాబై వేల రూపాయలను అందించి తన ఉదారతను చాటుకున్నారు, భవిష్యత్తులో సైతం పిల్లల చదువుల కోసం తన వంతు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు.

అమ్మ నాన్నలను కోల్పోయి బిక్కుబిక్కుమంటున్న పిల్లలకు నీలం మధు అండగా నిలబడి ఆర్థిక సహాయం అందించడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రాంతంతో సంబంధం లేకుండా ముగ్గురు చిన్నారులు కష్టంతో ఉన్నారని తెలియగానే వారిని పరామర్శించి అండగా నిలబడడన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్లం రాజు గుంటుకు శ్రీను, రొట్టెల శ్రీను, డా,, సత్యానారాయణ, రాగుల రాజు, కనకయ్య,నర్సింలు, మన్నే వెంకటయ్య,నర్సింలు, సాయి బాబా,సురేష్, రాజు, ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement