Sunday, April 28, 2024

TS – పిన్న‌వ‌య‌స్సులోనే లాస్య‌ అకాల మరణం బాధాక‌రం – కెసిఆర్…

హైదరాబాద్‌: కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపట్ల బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఆమె అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమన్నారు. అతిపిన్న వయస్సులో ఎమ్మెల్యేగా నందిత ప్రజల మన్ననలు పొందారని చెప్పారు. కష్టకాలంలో వారి కుటుంబానికి బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని తెలిపారు. లాస్య నందిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు

లాస్య లేర‌నేది అత్యంత విషాద‌క‌రం – కెటిఆర్

కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణం పట్ల బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ) సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. లాస్య ఇక లేరనే అత్యంత విషాదకరమైన, షాకింగ్‌ న్యూస్‌ తెలుసుకున్నానని చెప్పారు. దాదాపు వారం క్రితమే ఆమెను పరామర్శించానని, అంతలోనే మళ్లీ ప్రమాదానికి గురై మృతి చెందడం బాధాకరమన్నారు. చాలా మంచి నాయకురాలిగా ఉన్న యువ శాసనభ్యురాలిని కోల్పోవడం బీఆర్‌ఎస్‌ పార్టీకి తీరని నష్టమని చెప్పారు. ఈ విషాద సమయంలో ఆమె కుటుంబం, స్నేహితులకు బలం చేకూర్చాలని ప్రార్థించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement