Thursday, April 25, 2024

TS: కోవెలవెల్లి డ్యాన్స్ అదుర్స్‌.. శ‌భాష్ అంటూ ప్రశంసల‌తో ముంచెత్తిన ప్ర‌ముఖులు

కొత్తకోట (ప్రభ న్యూస్): నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌లో ఆ చిన్నారి అంద‌రిచేత శ‌భాష్ అనిపించుకుంటోంది. కొత్తకోట పట్టణ తెలంగాణ ఉద్యమకారుడు, టీఆర్ ఎస్‌ యువ నాయకుడు నరేష్ గౌడ్ కుమార్తె కోవెల‌వెల్లి డ్యాన్స్‌కు అంతా ఫిదా అవుతున్నారు. కొత్తకోట నివేదిత కాన్సెప్ట్ స్కూల్ ఈ చిన్నారి 5వ తరగతి చ‌దువుతోంది. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 90వ జయంతి ఉత్సవాలలో భాగంగా సాత్విక కూచిపూడి డాన్స్ అకాడమీ నుంచి దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన సలాం టు కలాం నృత్య ప్రదర్శనలో పాల్గొని పలువురి ప్రశంసలు పొందింది. ప్ర‌త్యేక‌ అవార్డు కూడా అందుకున్న‌ది కోవెలవెళ్లి.

Advertisement

తాజా వార్తలు

Advertisement