Monday, April 29, 2024

TS – 27 నుంచి ఉచిత విద్యుత్, గ్యాస్ ప‌థ‌కాలు అమ‌లు .. రేవంత్ రెడ్డి…

మేడారం – ఈ నెల 27 వ తేదీ సాయంత్రం రెండు గ్యారెంటీలు ప్రారంబించ‌నున్న‌ట్లు రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు.. మేడారంలో ఆయ‌న మీడియాలో మాట్లాడుతూ, సమ్మక్క సారక్కలంటేనే పోరాట స్పూర్తి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అమరులై దేవతలుగా వెలిసారని చెప్పారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆ దేవతలను కోరుకున్నానని తెలిపారు. మేడారం మహా జాతర సమ్మక్క సారలమ్మ పండుగ సంధర్భంగా శుక్రవారం ముఖ్య మంత్రి అమ్మవారికి నిలువెత్తు బంగారం (బెల్లం), పసుపు కుంకుమ, గాజులు, సమర్పించారు. త‌ల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు సీత‌క్క‌, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ మురళి నాయక్, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, జాతర ప్రత్యేక అధికారులు శరత్, ఆర్వీ కర్ణన్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఐటీడీఏ పీవో అంకిత్, ఎస్పీ శబరిష్ తదితరులు ఉన్నారు.


అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమైన ఏ కార్యక్రమం తీసుకున్న ఇక్కడి నుంచే మొదలు పెట్టామని చెప్పారు. హాత్ సే హాత్ జోడో యాత్ర ఇక్కడి నుంచే ప్రారంభించామని అన్నారు. ఇక రూ 500 లకే పేద మహిళలకు గ్యాస్ సిలిండర్ , 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ప‌థ‌కాల‌ను ఆ రోజు నుంచి అమ‌లు చేయ‌నున్న‌ట్లు చెప్పారు..ఈ రెండు గ్యారెంటీలు ప్రారంభానికి ముఖ్య అతిధిగా హాజరవుతున్న కాంగ్రేస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ హాజ‌ర‌వుతున్న‌ట్లు వెల్ల‌డించారు..

సమక్క సారక్క దీవెనలతోనే ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని అన్నారు. యాత్ర సమయంలో ఎలాంటి ఆకంటం లేకుండా జాతర జర్పిస్తామని మాట ఇచ్చామని మాట ప్రకారం జాతర కోసం రూ. 110 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశామని తెలిపారు. జాతరకు వచ్చేందుకు 6 వేల బస్సులతో రవాణా సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. 18 కోట్ల ఉచిత ఆర్టీసీ టికెట్లు వాడారని చెప్పారు. ఎన్నో వడిదుడుకులు ఎదురుకుని నిలబడ్డామని అందుకే ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని చెప్పారు. ప్రజా పాలన ప్రజలకు చేరువైతుందని నమ్మకం కల్పించామని తెలిపారు. జాతరకు కోటిన్నరకు పైగా భక్తులు వస్తే ఈ పండుగను జాతీయ పండుగగా మార్చమని కేంద్రాన్ని కోరామని కానీ అందుకు కేంద్రం స్పందించలేదని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement