Sunday, April 28, 2024

TS – సిద్దిపేట 130 కేవీ సబ్ స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం

సిద్దిపేట లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సిద్దిపేట పట్టణంలోని 130 కేవీ సబ్ స్టేషన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు పెరిగి సబ్ స్టేషన్ మొత్తానికి అంటుకున్నాయి

స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ పోలీసులు మంటలను ఆర్పేందకు ప్రయత్నిస్తున్నారు. ఘటన పై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు ఫోన్ లో మాట్లాడారు. మంటలను ఆర్పడానికి గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ నుంచి ఫైర్ ఇంజన్లు తీసుకెళ్లాలని భట్టి అధికారులను ఆదేశించారు.

సంఘటన స్థలానికి హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర రెడ్డి చేరుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement