Saturday, April 13, 2024

TS – ఎన్నిక‌ల‌లో మాట ఇచ్చాం – కుల గ‌ణ‌న చేస్తున్నాం – ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి

హైద‌రాబాద్ – కుల గణన తీర్మానం పై అసెంబ్లీలో ఉప ముఖ్య‌మంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సంపద, రాజ్యాధికారం అంతా కొందరికి వస్తుందని రాహుల్ గాంధీ కుల జనగణన చేద్దాం అన్నార‌ని, ఆయ‌న‌. చెప్పిన మాట ప్రకారం కుల జన గణన చేస్తున్నామన్నారు. ఇది చరిత్రాత్మక తీర్మానం అన్నారు. రాష్ట్ర ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీని ఇప్పుడు అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల వారి వివరాలు సేకరిస్తామన్నారు. ప్రతీ ఇంటిని కులాలను సర్వే చేస్తామన్నారు. ఆర్థిక స్థితి గతులు కూడా సర్వే చేస్తామని తెలిపారు.

సర్వరోగ నివారణ లాగా సర్వే ఉంటుందన్నారు. సామాజిక..ఆర్థిక..రాజకీయ మార్పులకు పునాదిగా మారబోతుందని తెలిపారు. మార్పు కోరుకునే వాళ్ళు మద్దతు ఇవ్వాలని కోరారు. సలహాలు ఇవ్వండన్నారు. కుల గ‌ణ‌న‌పై క్లారిటీ త‌మ‌కు ఉంద‌ని, .కన్ఫ్యూజన్ లో మీరు ఉన్నారంటూ కేటీఆర్, కడియం శ్రీహరికి క్లారిటీ ఇచ్చారు. తీర్మానం క్లియర్ గా ఉందన్నారు. ఇల్లు ఇల్లు సర్వే చేస్తున్నామన్నారు. కుల గణన అన్నం .క్లారిటీగా ఉన్నాం.. కన్ఫ్యూజ్ కాకండి అన్నారు. స‌భ‌ను ర‌న్నింగ్ కామెంట‌రీతో కేటీఆర్.. కడియం కన్ఫ్యూజ్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు నష్టం చేసేలా చేయకండని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement