Tuesday, February 20, 2024

TS | ఐపీఎస్ అధికారుల బదిలీ.. ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

పనిచేస్తున్న ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏసిబి డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఏ ఆర్ శ్రీనివాస్ ను తెలంగాణ పోలీస్ అకాడమీ అడిషనల్ డైరెక్టర్ గా, డిఐజి హోంగార్డ్స్ అండ్ టెక్నికల్ సర్వీసెస్ లో పనిచేస్తున్న అంబర్ కిషోర్ జా ను రాచకొండ అడ్మినిస్ట్రేషన్ జాయింట్ కమిషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు రేపో, ఎల్లుండో షెడ్యూల్ విడుదలవుతున్న నేపథ్యంలో సీనియర్ ఐపిఎస్ అధికారులను బదిలీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement