Tuesday, May 7, 2024

Traffic restrictions: ఎల్బీస్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు… ఆ రూట్ల‌లో దారి మ‌ళ్లీంపు

హైద‌రాబాద్‌లోని ఎల్బీ స్టేడియం ప‌రిస‌రాల ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు. ఇవాళ ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్‌రెడ్డి స్టాఫ్ న‌ర్సుల‌కు నియామ‌క‌ప‌త్రాలు అంద‌జేయ‌నున్న నేప‌థ్యంలో ట్రాఫిక్ ఆంక్షాల‌ను విధించిన‌ట్లు ట్రాఫిక్ అద‌న‌పు సీపీ విశ్వ‌ప్రసాద్ తెలిపారు.

స్టేడియం ప‌రిసరాల్లో మ‌ధ్యాహ్నాం నుంచి రాత్రి 7గంట‌ల వ‌ర‌కు ఆంక్షాలు కొన‌సాగుతాయ‌ని వాహ‌న‌దారులు దీనిని గ‌మ‌నించాల‌న్నారు. ఏఆర్ పెట్రోల్ బంక్ నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వెళ్లే వాహనాలను నాంపల్లి వైపు మళ్లిస్తారు. బషీర్బాగ్ నుంచి ఏఆర్ పెట్రోల్ బంక్ వైపు వచ్చే వాహనాలను ఎస్బీహెచ్, అబిడ్స్, నాంపల్లి స్టేషన్ రోడ్డుకు మళ్లించనున్నట్టు అదనపు సీపీ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement