Tuesday, May 7, 2024

పోల‌వ‌రం బ్యాక్ వాట‌ర్ తో పెను ముంపు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: పోలవరం ముంపుపై సీడబ్ల్యూసీ సమావేశంలో ఏపీని నిలదీసేందుకు రాష్ట్ర నీటి పారుదల శాఖ సిద్ధమైంది. జులైలో పోలవరం ముంపుతో భద్రాచలంలో తీవ్ర నష్టం సంభవించినా ఇప్పటికీ ఎందుకు నివారణ చర్యలు పేపట్టడం లేదని 10 తేదీన జరగనున్న సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీసేందుకు తెలంగాణ ఆధారా లతో నివేదికలను రూపొందిస్తున్నది. అయితే పోల వరంతో తెలంగాణలో ముంపు సంభవించలేదని ఏపీ చేస్తున్న వాదనలను ఎండగట్టేందుకు పటిష్టమైన ప్రణాళికలను రాష్ట్ర నీటి పారుదల శాఖ సిద్ధం చేస్తుం ది. పోలంవరం బ్యాక్‌ వాటర్‌తో అనేక ప్రాంతాలు తీవ్ర నష్టపోయినట్లు వీడియో ఆధారాలున్నప్పటికీ, జాతీయ స్థాయిలో చర్చ జరిగినప్పటికీ తప్పించు కునేందుకు ఏపీ చేస్తున్న ప్రయత్నాలను ఈ సమా వేశంలో ఎండగట్టేందుకు అధికారులు సిద్ధమయ్యా రు. ముంపు ప్రాంతాలను దేశంలోని ప్రజలందరూ మీడియా ద్వారా చూసినప్పటికీ పోలవరంతో తెలంగాణలో ముంపు జరగలేదని ఏపీ వాదించడం పట్ల తెలంగాణ ఆగ్రహం
వ్యక్తం చేస్తుంది. ఈ మేరకు నీటిపారుదల శాఖ నిపుణులు సమావేశమై సీడబ్ల్యూసీ సమావేశంలో వీడియో క్లిప్పింగ్స్‌ ప్రదర్శించి ఏపీ నిజస్వరూపాన్ని దేశప్రజలకు చూపించాలనే పట్టుదలతో నివేదికలను రూపొందిస్తున్నది. ముంపునకు మరో అధ్యయనం అవసరం లేదని కేంద్ర జల సంఘం ఓరా చెప్పడాన్ని కూడా తెలంగాణ తప్పుబట్టింది. సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో పోలవరం అథారిటీతో కలిసి పోలవరం ముంపుబాధిత రాష్ట్రాలు ఒడిశా, చత్తీస్‌గఢ్‌, తెలంగాణతో ఉమ్మడి సర్వే నిర్వహించాలని తెలంగాణ డిమాండ్‌ చేస్తోంది.

జులైలో కురిసిన భారీ వర్షాలతో భద్రాచలం, ముర్రేడు, కిన్నరసాని వాగులు పోటెత్తి మరో ఆరు స్ల్యూయిస్‌కు సంబంధించి బ్యాక్‌ వాటర్‌ ప్రమాద ఘంటికలు మోగించింది. పలు గ్రామాలు నీటమునిగాయి… వరదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వేల ఎకరాల పంట భూములు నీటమునిగాయి. వరద ప్రవాహానికి సాగుభూమిలో ఇసుక తెప్పలు తేలాయి. అయితే భారీ వరదలను తట్టుకునే స్థాయిలో పోలవరం లేకపోవడంతోనే బ్యాక్‌ వాటర్‌ ప్రమాదం ఏర్పడిందని తెలంగాణ వాదిస్తున్నది. జులైలో గోదావరిలో 75.6 అడుగుల నీటిమట్టానికి వెళ్లేందుకు దారిలేక ఎక్కడికక్కడ ముంపునకు గురిచేసింది. అయితే కేంద్రం ఎలాంటి సహాయం అందించకపోవడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.1000 కోట్ల ప్రాకేజీ ప్రకటించి తాత్కాలికంగా ప్రజలకు ఉపశనం కలిగించారు. అయితే తిరిగి ఇలాంటి వరదలు వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో శాశ్వత ముంపు చర్యలు చేపట్టాలని తెలంగాణ నీటిపారుదల శాఖ డిమాండ్‌ చేస్తోంది. అయితే ఏపీ తప్పించుకునే ప్రయత్నంలో 50 లక్షల క్యూసెక్కుల వరదను అంచనావేసి సర్వే చేశామనీ, నీరు ఎక్కడికి ఏమేరకు వస్తాయో ఇప్పటికే సర్వే చేసి రాళ్లు సిద్ధం చేసినట్లు ఏపీ వాదించింది. అయితే ఆ రాళ్లను మాత్రం తెలంగాణకు చూపించేందుకు నిరాకరించడంతో తెలంగాణ ఉమ్మడి సర్వేకు పట్టుబడుతోంది.

పోలవరం ముంపుతో తీవ్ర నష్టం వాటిల్లిందని తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు డిమాండ్‌ చేయడంతో విధిలేని పరిస్థితిలో పోలవరం ముంపుపై తక్షణమే సర్వే చేపట్టాలని కేంద్ర జలసంఘం ఆదేశించింది. ఈ నేపథ్యంలో 10వ తేదీన సీడబ్ల్యూసీ పోలవరం అథారిటీ, ఆంధ్ర, తెలంగాణ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటుచేసింది. ఈ సమావేశంలో తెలంగాణకు జరిగిన నష్టాలపై పవర్‌ ఫాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించేందుకు తెలంగాణ సిద్ధమైంది. ఈ సమావేశంలో తెలంగాణ ప్రధానంగా పోలవరం ఎఫ్‌ఆర్‌ఎల్‌ లెవల్‌లో నీటిని నిల్వచేసినప్పుడు ఏర్పడుతున్న ముంపును గుర్తించాలనీ, అదేవిధంగా డ్రైనేజ్‌ స్థానిక ప్రవాహాలు నిలిచిపోవడంతో ఏర్పడే నష్టాలను అధ్యయంనం చేయాలి, మణుగూరు బార జల కేంద్రం, చరిత్రాక భద్రాచలం ఆలయానికి రక్షణకు చర్యలు చేపట్టాలి, కొత్తగా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని ఈ సమావేశంలో తెలంగాణ డిమాండ్‌ చేయనుంది. పోలవరం బ్యాక్‌ వాటర్‌ ముంపునకు శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలి, రాబోయే వర్షకాలంలో తిరిగి ముంపు ఏర్పడకుండా చర్యలు చేపట్టాలని 10వ తేదీన జరగనున్న సమావేశంలో తెలంగాణ వాదనలు వినిపించేందుకు సిద్ధమైంది. జాయింట్‌ సర్వే నిర్వహించి పుణలోని సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ నిపుణులతో అధ్యయనం చేయించాలని సమావేశంలో తెలంగాణ సూచించనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర నీటిపారుదల ఉన్నతాధికరులు, ఇంజనీరింగ్‌ చీఫ్‌ నాగేందర్‌ రావు, చీఫ్‌ ఇంజినీర్‌ కొత్తగూడెం శ్రీనివాస్‌ రెడ్డి తదితరులు హాజరుకానున్నారు. ముంపు ప్రాంతాల్లో కరకట్టల నిర్మాణాలు, నష్ట పరిహారం చెెల్లించాలని తెలంగాణ పట్టుబట్టనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement