Friday, May 24, 2024

TS: ఇవాళ చిలుకూరు బాలాజీ ఆలయంలో స్వామివారి కల్యాణం

చిలుకూరు బాలాజీ ఆలయంలో బ్రహోత్సవాల్లో భాగంగా ఇవాళ చిలుకూరు బాలాజీ ఆలయంలో స్వామివారి కల్యాణం జరగనుంది. అయితే శుక్రవారం ఆలయంలో గరుడ ప్రసాదం వితరణ జరగడంతో ఊహించని విధంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పెద్ద సంఖ్యలో వాహనాలు రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ పరిస్థితుల దృష్ట్యా చిలుకూరు బాలాజీ ఆలయంలో ఈరోజు జరగాల్సిన వివాహ ప్రాప్తి కార్యక్రమం రద్దు చేశారు. ఈ మేరకు చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ తెలిపారు.

- Advertisement -

కళ్యాణోత్సవం నిమిత్తం ఈరోజు ఎవరూ వివాహ ప్రాప్తి కార్యక్రమానికి రావద్దని కోరారు. పెళ్లి కోసం ఎదురుచూసే వారు తమ ఇళ్ల నుంచి దేవుడిని ప్రార్థించాలని సూచించారు. ఈరోజు సాయంత్రం స్వామివారి కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. శుక్రవారం చిలుకూరు ఆలయంలో గరుడప్రసాద వితరణలో ఇబ్బందులు తలెత్తడంతో వివాహాన్ని రద్దు చేసుకున్నట్లు తెలిపారు. చిలుకూరు బాలాజీ ఆలయంలో ఈ నెల 25 వరకు బ్రహోత్సవాలు జరగనున్నాయి. బ్రహోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణం అనంతరం గరుత్మంతుడికి సమర్పించే గరుడ ప్రసాదాన్ని సంతానం లేని మహిళలు స్వీకరిస్తే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం.

Advertisement

తాజా వార్తలు

Advertisement