Sunday, May 26, 2024

TS: కొమరంభీం జిల్లాలో పులి సంచారం… ఆ రూట్లో రాకపోకల నిషేధం

కొమరంభీం జిల్లా పులి సంచారం భయాందోళనకు గురి చేస్తుంది. కాగజ్ నగర్ అటవీ ప్రాంతంలో పులి  జాడలను అధికారులు గుర్తించారు. పులి సంచారం నేపథ్యంలో అంకుశాపూర్ వాంకిడి వైపు వెళ్లే దారిలో సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు రాకపోకల నిషేధం విధించారు.

- Advertisement -

ఆ ప్రాంతంలో వన్య ప్రాణుల సంచారానికి ఆటంకం కలగకుండా ఉండడం కోసం అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అంకుశాపూర్ వాంకిడి రహదారి వైపు వన్య ప్రాణుల కదలికలు ఉన్నాయన్న ఉద్దేశంతోనే ముందస్తుగా అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎండాకాలంలో ఎక్కువగా రహదారి వైపు పులులు లేదా ఇతర అటవీ జంతువులు వచ్చే అవకాశం ఉందని గ్రామస్థులను ఫారెస్ట్ సిబ్బంది అలెర్ట్ చేశారు. జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement