Sunday, April 28, 2024

TS | తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య ఇదే.. ఇంకా అప్లయ్​ చేసుకోవచ్చన్న ఈసీ!

తెలంగాణలో ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం ఇవ్వాల (బుధవారం) విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 3,17,17,389 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లండించింది. ఇందులో పురుష ఓటర్ల సంఖ్య 1,58,71,493గా ఉండగా, మహిళా ఓటర్ల సంఖ్య 1,58,43,339గా ఉందని ఈసీ పేర్కొంది. జనవరితో పోలిస్తే 5.8 శాతం ఓటర్ల సంఖ్య పెరిగినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.

– వెబ్​ డెస్క్​, ఆంధ్రప్రభ

రాష్ట్రవ్యాప్తంగా 6.10 లక్షల మంది ఓట్లను తొలగించినట్లు ఈసీ తెలిపింది. ఓటర్ల జాబితాలో లింగ నిష్పత్తి 998:1000గా ఉందని ట్రాన్స్‌జెండర్ ఓటర్ల సంఖ్య 2,557 ఉన్నట్లు పేర్కొంది. తుది జాబితా ప్రకటించినప్పటికీ.. ఓటర్ల జాబితాను ఆధునీకరించే కసరత్తు కొనసాగుతుందని ఈసీ తెలిపింది. అర్హులైన వ్యక్తులు ఇంకా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. eci.gov.in వెబ్ సైట్ ద్వారా నూతనంగా అప్లికేషన్ చేసుకోవచ్చని ఈసీ సూచించింది.

తెలంగాణ తుది ఓటర్ల జాబితా విడుదల

పురుషులు – 1,58,71,493
మహిళలు – 1,58,43,339
ట్రాన్స్ జెండర్ – 2,557
సర్వీసు ఓటర్లు – 15,338
ప్రవాస ఓటర్లు – 2,780

- Advertisement -

మరోవైపు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సీఈసీ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని బృందం హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. మంగళవారం నుంచి అసెంబ్లీ ఎన్నికలపై సీఈసీ బృందం సమీక్షింస్తోంది. కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ రాజీవ్ కుమార్ బృందం సమావేశమైంది. గురువారం తెలంగాణ సీఎస్, డీజీపీతో సీఈసీ బృందం భేటీ కానుంది. అనంతరం ఎన్నికలకు సంబంధించి సీఈసీ రాజీవ్ కుమార్ మీడియాతో మాట్లాడనున్నారు. ఈ నెల 6 లేదా 7వ తేదీ తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement