Thursday, April 25, 2024

సినిమాలో ఉన్న‌ట్లుగా ఉందే… ఈ బైక్ సీన్


ఈ సీన్ చూస్తే అరెరె సినిమా నో.. సీరియ‌ల్ షూటింగ్ జ‌రుగుతుందేమో అనుకుంటారు.. కానీ అది కాదు సంగ‌తి…రియ‌ల్ గానే జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌ను మీరూ చూడొచ్చు.. ఖమ్మం రావిచెట్టు బజార్‌లోని ఓ క్లాత్ సెంటర్‌లో కస్టమర్లు బట్టలు కొనేందుకు వెళ్లారు. వాళ్ల పనిలో వాళ్లుండ‌గా సడెన్‌గా షాప్‌లోకి ఓ బైక్ దూసుకొచ్చింది. షాప్ అద్దాల్లోంచి సినిమా సీన్‌ తలపిస్తూ దూసుకొచ్చిన బైక్‌ కిందపడిపోగా.. అది నడుపుతున్న వ్యక్తి మాత్రం అంతెత్తున ఎగిరి కౌంటర్‌లోపల పడ్డాడు. ఇదంతా ఆ షాప్‌లో ఉన్న సీసీ కెమెరాలకు చిక్కింది. ఊహించని శబ్దంతో కస్టమర్లంతా కంగారు పడ్డారు. ఏం జరుగుతుందో తెలియక ఖంగారుగా అక్క‌డి నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు పెట్టారు. ఇదిలా ఉంటే ఆ బైక్ పై ఉన్న వ్య‌క్తి కింద‌ప‌డిపోగా… మెల్లిగా నిల్చునే ప్రయత్నం చేశాడు. అయితే ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రికీ గాయాలు కాక‌పోవ‌డంతో అంద‌రూ పీల్చుకున్నారు. అయితే ఈ స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకుని బైక్‌ను స్వాధీనం చేసుకుని, ప్రాథ‌మిక విచార‌ణ జ‌రిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండిhttp://twitter.com/AndhraPrabhaApp, facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement