Tuesday, October 8, 2024

TS: భవిష్యత్తు మనదే.. కష్టపడి పని చేయండి… కేటీఆర్

.. కాంగ్రెస్ వి అమలుచేయని గ్యారంటీలు
.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

భవిష్యత్తు అంతా బీఆర్ఎస్ దేనని ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలియజేశారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ లో సిరిసిల్ల పట్టణ క్లస్టర్, వైస్ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై పార్లమెంట్ ఎన్నికల కోసం దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ అమలుకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిందన్నారు. గ్యారంటీలు అమలు చేయడం సాధ్యం కాదని, రాబోయే లోక్ స‌భ‌ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, భవిష్యత్తు అంతా మనదేనన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటితే తిరిగి పూర్వ వైభవం వస్తుందన్నారు. రైతు సమస్యలను గాలికి వదిలేసారని, ప్రభుత్వ చేతకానితనంతో అన్నం పెట్టే అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. రైతుబంధు అందించలేదని, డిసెంబర్ 9వ తేదీన రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి నాలుగు నెలలు గడిచినా అమలు చేయడం లేదన్నారు. లోక్ స‌భ‌ ఎన్నికల్లో రైతులను మరోసారి మోసగించేందుకు ఆగస్టు 15వ తేదీ అని ముఖ్యమంత్రి మరోసారి కొత్త డ్రామాకు తెర లేపారన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement