Friday, July 26, 2024

TS: బైక్ ను ఢీకొట్టిన కారు… యువ‌కుడు మృతి

బైక్ ను కారు ఢీకొట్ట‌డంతో యువ‌కుడు మృతిచెందిన ఘ‌ట‌న‌ ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మెట్టుపల్లి గ్రామం సమీపంలో చోటుచేసుకుంది. కారు ఢీకొని యువకుడు మృతిచెందిన సంఘటన ఇవాళ‌ మధ్యాహ్నం జరిగింది.

కల్లూరు వైపు నుంచి వస్తున్న కారు తల్లాడ వైపు నుంచి కల్లూరు వెళ్తున్న ద్విచక్ర వాహనంను కారు ఢీకొట్టడంతో బైక్ పై ప్రయాణిస్తున్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో డ్రైవ‌ర్ కారును అక్కడే వదిలేసి పరారయ్యారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement