Wednesday, May 15, 2024

మార్కులు చెక్‌ చేసుకునేందుకు వెబ్‌సైట్‌లో టెట్‌ ఓఎంఆర్‌ షీట్లు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఇటీవల విడుదల చేసిన టెట్‌ ఫలితాల్లో వచ్చిన మార్కులకు, ప్రాథమిక, తుది కీలో వచ్చిన మార్కులకు వ్యత్యాసం ఉందని ఆందోళన పడుతున్న అభ్యర్థుల కోసం ఓఎంఆర్‌ షీట్లను రాష్ట్ర విద్యాశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. టెట్‌ ఫలితాలకు సంబంధించి జూన్‌ 29న ఫైనల్‌ కీని అధికారులు విడుదల చేయగా జులై 1న తుది ఫలితాలను వెల్లడించింది. అయితే ప్రాథమిక, ఫైనల్‌ కీలో వచ్చిన మార్కులకు ప్రకటించిన ఫలితాల్లో వచ్చిన మార్కులకు చాలా తేడాలు ఉన్నాయని గతంలో అభ్యర్థులు వాపోయారు.

ఫైనల్‌ కీలో చూసుకుంటే 80 మార్కులు వచ్చాయని, ఫలితాల్లో మాత్రం ఆ స్కోరు 73కు పడిపోవడంతో తాను అర్హత పొందలేకపోయానంటూ ఓ అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మరికొంత మంది కూడా తమకు వచ్చిన మార్కుల్లో తేడా ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో అభ్యర్థుల్లో నెలకొన్న అపోహలు తీర్చేందుకు విద్యాశాఖ అధికారులు ఓఎంఆర్‌ షీట్లను గురువారం నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. రూ.15 రుసుమును చెల్లించి ఓఎంఆర్‌ షీటు పొంది మార్కులు చెక్‌ చేసుకునేలా ఉంచారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement