Sunday, April 28, 2024

ప్ర‌శాంతంగా ప్రారంభ‌మై ‘టెట్’ ప‌రీక్ష‌..

హైదరాబాద్‌: నేడు టెట్‌ పరీక్షలు ప్రారంభ‌మ‌య్యాయి … పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు పేపర్‌-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష నిర్వహించనున్నారు. పేపర్‌-1 పరీక్షకు 1,139 కేంద్రాలను, పేపర్‌-2కు 913 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పేపర్‌-1కు 2,69,557 మంది, పేపర్‌-2కు 2,08,498 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 4.78 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. ప‌రీక్షా కేంద్రాల వ‌ద్ద అభ్య‌ర్ధుల‌ను త‌నిఖీ చేసిన అనంత‌రం హాలులోకి అనుమ‌తించారు..

కాగా, టెట్‌ పరీక్షల నేపథ్యంలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసిన విద్యా సంస్థలకు ఇవాళ ప్రత్యేక సెలవు ప్రకటించారు. అదేవిధంగా పరీక్షల పర్యవేక్షణకు 2,052 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 22,572 మంది ఇన్విజిలేటర్లు, 10,260 మంది హాల్‌ సూపరింటెండెంట్లను నియమించారు. అన్ని కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను, వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి ఆర్టీసీ బస్సుల సౌకర్యం కల్పించారు. అభ్యర్థులు కనీసం గంట ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, బ్లాక్‌ బాల్‌పాయింట్‌ పెన్నులు, హాల్‌టికెట్‌ను వెంట తెచ్చుకోవాలని సూచించారు.

పెద్ద‌ప‌ల్లిలో 11 పరీక్ష కేంద్రాలు

టెట్ పరీక్ష పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రశాంతంగా జరుగుతుంది. శుక్రవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని 11 పరీక్షా కేంద్రాల్లో టెట్ పరీక్ష నిర్వహించారు. కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాటు చేశారు. విద్యార్థులు పరీక్ష కోసం సకాలంలో హాజరయ్యారు. ఇలాంటి అమాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 11 పరీక్ష కేంద్రాల వద్ద పెద్దపల్లి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్దపల్లి సిఐ అనిల్, ఎస్సై మహేందర్ లు టెట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement