Thursday, April 25, 2024

పండుగలా దశాబ్ది ఉత్సవాలు – టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి

ప్రభన్యూస్, ప్రతినిధి /యాదాద్రి ఊరూరా పండుగ వేడుకల్లా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని టెస్కాబ్ వైస్ చైర్మన్, ఉమ్మడి నల్గొండ డీసీసీబీ చైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. గురువారం భువనగిరి పట్టణ కేంద్రంలోని డీసీసీబీ బ్యాంక్ లో ఏర్పటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు నేటి నుంచి 21 రోజుల పాటు ఊరూరా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తొమ్మిదేళ్ల ప్రగతిని దశ దిశలా చాటేలా ప్రభుత్వం సంబురాలను నిర్వహిస్తున్నదని, ప్రభుత్వ విజయాలను ఇంటింటికి తీసుకెళ్లేలా రైతులు సిద్ధంగా ఉండాలన్నారు. అవతరణ వేడుకల్లో ప్రతి పిఏసీఎస్ కార్యాలయం ముందు జెండా ఆవిష్కరణ చేసి 3న రైతు దినోత్సవ వేడుకలకు సిద్ధం అవుతున్నట్లు చెప్పారు.

కార్యాలయాల్లో మామిడి తోరణాలు, విద్యుత్ దీపాల అలంకరణతో 21 రోజుల పండుగలా దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తామని, రైతులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు భాగస్వామ్యులు అయ్యి విజయవంతం చేయాలని కోరారు. రైతుల పక్షపతిగా సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి అమలు చేసి రైతు భాంధావుడిగా నిలిచాడన్నారు. సాగు జలాలు, ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా, గిట్టుబాటు ధర,వ్యవసాయ రుణాలు , మిషన్ కాకతీయ లాంటి పథకాలతో వ్యవసాయ రంగంలో ఎంతో ప్రగతి సాధించామన్నారు. ఈ సమావేశంలో డీసీసీబీ డైరెక్టర్ లింగం, పిఏసీఎస్ చైర్మన్లు చింతలపురి భాస్కర్ రెడ్డి, నోముల పరమేశ్వర్ రెడ్డి, ఇమ్మడి రాంరెడ్డి, నర్సింహా రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

మూడేళ్ళలోనే రూ. 23వందల కోట్ల టర్నవర్.

నల్గొండ డీసీసీబీ 103 సంవత్సర కాలంలో రూ. 9వందల కోట్ల టర్నవర్ ఉండగా తాను బాధ్యత తీసుకున్న మూడేళ్ళలో రూ. 23వందల కోట్ల టర్నవర్ లో లావాదేవీలు నిర్వహిస్తున్నామని టెస్కాబ్ వైస్ చైర్మన్, ఉమ్మడి నల్గొండ డీసీసీబీ చైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా డీసీసీబీ నుంచి 21 రోజుల వరకు దశాబ్ది డిపాజిట్ పథకం ప్రవేశ పెట్టినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ సారధ్యంలో సహకార సంఘాల రూపురేఖలు మార్చి నిష్పక్షపాతంగా రైతులకు మరిన్ని సేవలను అందించే విధంగా బలోపేతం చేశాడన్నారు. రైతుల పిల్లలు విదేశాల్లో చదివేందుకు గాను రూ. 30 లక్షల వరకు విద్యా ఋణాలు అందజేస్తున్నామని, ఇప్పటికే జిల్లాలో 1000 మందికి ఇచ్చి రాష్ట్రంలో ప్రధమ స్థానంలో ఉన్నామనన్నారు. వ్యవసాయ,బంగారం, ఎల్ టి , మాడిగేజ్ రుణాలు అందజేసామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement