Wednesday, November 29, 2023

Suicide – చదువుల వత్తిడి , ఆన్ లైన్ గేమ్ వ్యసనంతో విద్యార్ధి బలవన్మరణం

హైదరాబాద్: రాయదుర్గంలో పదో తరగతి విద్యార్థి అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది. అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి బాలుడు బలవన్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. సోమవారం రాత్రి 7.30 గంటలకు బాలుడు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. కానీ ఎంత సమయమైనా తిరిగి ఇంటికి రాకపోయేసరికి అతడి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో కుమారుడి కోసం వెతికారు. అనంతరం అర్ధరాత్రి దాటాక 2 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

- Advertisement -
   

దీంతో పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి.. బాలుడి ఆచూకీ కోసం పలుచోట్ల వెతికారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 7గంటలకు బాలుడి కుటుంబం నివాసముంటున్న అపార్ట్‌మెంట్‌ పక్క బ్లాక్‌ ముందు రక్తపు మడుగులో పడి ఉన్న అతడి మృతదేహం లభ్యమైంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కొన్ని రోజులుగా విద్యార్థి ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసకావటం, చదువు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement