Sunday, April 28, 2024

Results | వారం రోజుల్లో ఇంటర్​, ఎస్​ఎస్​సీ రిజల్ట్స్​.. పూర్తయిన మూల్యాంకనం

తెలంగాణలో పదో తరగతి, ఇంటర్​ పరీక్షల ఫలితాలను ఈ వారంలో ప్రకటించనున్నట్టు ఇంటర్​ బోర్డు తెలిపింది. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఎస్‌ఎస్‌సి బోర్డు ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనాన్ని పూర్తి చేశాయి. రిజల్ట్​ పరంగా ఎటువంటి తప్పులు జరగకుండా ఫలితాలను వెరిఫై చేస్తున్నట్టు అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

2023 సంవత్సరానికి సంబంధించి ఇంటర్ పరీక్షలు మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ వ తేదీ వరకు జరిగాయి. మొత్తం 5,05,625 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. కాగా, పరీక్షలకు సంబంధించిన సమాధాన పత్రాల మూల్యాంకనం కూడా పూర్తయ్యింది. ఇక.. SSC పరీక్షలకు 2,49,747 మంది బాలురు, 2,44,873 మంది బాలికలు సహా 4,94,620 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏప్రిల్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి. దీనికి సంబంధించిన ఆన్సర్​ షీట్స్​ మూల్యాంకనం కూడా పూర్తయ్యింది.

ఫలితాలు ప్రకటించిన తర్వాత విద్యార్థులు తమ మార్కు షీట్లను సంబంధిత బోర్డుల అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రిజల్ట్​ పరంగా ఎట్లాంటి పొరపాట్లకు తావులేకుండా, తప్పులు దొర్లకుండా ఉండేలా తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, SSC బోర్డు అవసరమైన అన్ని చర్యలను చేపట్టింది. పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంలో విఫలమైన వారు త్వరలో నిర్వహించే అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావచ్చని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement