Sunday, April 28, 2024

Telangana – పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం

చెన్నూర్ ఫిబ్రవరి 15( ప్రభ న్యూస్) నిరు పేదలకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం చెన్నూరు కేంద్రంగా ప్రతి నిత్యం బారి వాహనాల్లో సమీప మహారాష్ట్ర కు తరలిస్తూ కొంత మంది స్థానిక వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. మహా రాష్ట్రలో రేషన్ బియ్యం అక్కడి ప్రభుత్వం పంపిణీ చేయక పోవడం తో మహారాష్ట్ర గ్రామీణ ప్రాంత ప్రజలు 15 నుంచి 25 రూపాయలు చెల్లించడం తో వ్యాపారుల దందా మూడుపువ్వులు ఆరు కాయలు గా సాగుతుంది. అక్రమ బియ్యం రవాణా దందాను నియంత్రించాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో మునుగుతుడడంతో జిల్లా ఎన్ఫోర్స్ మెంట్ సిబ్బంది అప్పుడప్పుడు నామమాత్రపు కేసులు చేసి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు ప్రజలనుంచి వినిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement