Monday, April 29, 2024

సవరించిన జీవో ఇవ్వండి: రూ.58 కోట్ల వ్యవహారంపై హైకోర్టు ఆదేశం

కోర్టు ధిక్కరణ కేసులకు రూ.58 కోట్ల కేటాయింపు జీవోపై తెలంగాణ హైకోర్టు విచారించింది. భూసేకరణ పరిహారం చెల్లింపు కోసమే జీవో జారీ చేసినట్టు కోర్టుకు ఏజీ తెలిపారు. నిధులు విడుదల చేయవద్దన్న ఉత్తర్వులు ఉపసంహరించాలని ఏజీ కోరారు. అయితే, జీవో తప్పుదోవ పట్టించేలా ఉందని హైకోర్టు పేర్కొంది. భూసేకరణ పరిహారం చెల్లింపు కోసమని జీవోలో ప్రస్తావించాలని, సవరించిన జీవో సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 13కి కోర్టు వాయిదా వేసింది.

కాగా, కోర్టు ధిక్కరణ కేసుల కోసం రూ. 58 కోట్ల కేటాయింపుపై హైకోర్టుకు సీఎస్ సోమేష్ కుమార్ వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ రూ. 58 కోట్లు తనపై కోర్టు ధిక్కరణ కేసుల కోసం కాదని అన్నారు. భూసేకరణ పరిహారం చెల్లింపు కేసుల్లో కోర్టు ధిక్కరణ కేసుల కోసమేనని ఏజీ తెలిపారు. పిటిషనర్ కోర్టును తప్పుదోవ పట్టించారని సీఎస్ సోమేష్‌కుమార్ తెలిపారు.

ఇది కూడా చదవండి: పథకం అంటే నియోజకవర్గానికే పరిమితమవుతుందా?: తలసాని కౌంటర్

Advertisement

తాజా వార్తలు

Advertisement