Friday, April 26, 2024

తెలంగాణ ప్రభుత్వ విధానాలు దేశానికే ఆదర్శం. మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి/పెద్దమందడి: మార్చ్ 2 (ప్రభ న్యూస్) : తెలంగాణ ప్రభుత్వ విధానాలు దేశానికే ఆదర్శంగా నిలవనున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. గురువారం పెబ్బేరు రోడ్డులో గల మర్రికుంట దగ్గర సింజెంటా కంపెనీ రూ.3.40 కోట్లతో నిర్మించిన వే సైడ్ మార్కెట్ ను సింజెంటా గ్లోబల్ సీఈవో హెరిక్ దేశ ప్రతినిధులు సుశీల్, ఫణీంద్రలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా వనపర్తిలో అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తున్నామని, వినియోగదారుల సౌకర్యం కోసం టాయిలెట్లు, ఆయాలు ఆట స్థలాలు, లాన్ పార్కింగ్ వంటివి ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.

దేశంలోనే నూతన ఆలోచనతో ఏర్పాటు చేసిన ఏకైక వే సైడ్ మార్కెట్ వనపర్తిలో తనకు ఎంతో గర్వకారణమ‌ని అన్నారు. భవిష్యత్తులో ప్రపంచానికి భారతదేశం అన్నం పెడుతుందని తాను బలంగా విశ్వసిస్తున్నానని తెలిపారు. ప్రపంచంలో నాణ్యమైన కూరగాయల విత్తనాలను అందించే కంపెనీల్లో సింజెంటా ప్రముఖమైనదని రైతులకు ఎంతో లాభం చేకూర్చే వే సైడ్ మార్కెట్ ను నిర్మించి ఇచ్చిన సింజెంటా కంపెనీకి మంత్రి నిరంజన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. అలాగే రైతులకు లాభం చేకూర్చేందుకు పట్టణంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణంలో ఉందని, దానిని కూడా త్వరలో పూర్తి చేయనున్నట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, మార్కెట్ చైర్మన్ పలుస రమేష్ గౌడ్, వివిధ మండలాల ప్రజా ప్రతినిధులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement