Tuesday, May 21, 2024

టీఎస్​పీఎస్​సీ గ్రూప్​ 1 క్లాసులకు దరఖాస్తులు.. ఆగస్టు 5 నుంచి ఆన్​లైన్​ తరగతులు

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నుండి ఒక పత్రికా ప్రకటన ఇవ్వాల వెలువడింది. దీని ప్రకారం గ్రూప్-1 ఆన్‌లైన్ తరగతులు ఆగస్టు 5 నుండి ప్రారంభం కానున్నాయి. ఉచిత కోచింగ్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ప్రమాణాలు డిగ్రీ, ఇంటర్మీడియట్ లేదా SSC సర్టిఫికెట్​ ఉండాలి. అభ్యర్థుల వార్షికాదాయం రూ.5 లక్షల లోపు ఉన్న తల్లిదండ్రులు అర్హులని టీఎస్​పీఎస్​సీ పేర్కొంది.

TSPSC గ్రూప్-Iకి అధిక విద్యార్హతలకు 10 శాతం, అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ మార్కులకు 50 శాతం, ఇంటర్మీడియట్ మార్కులకు 20 శాతం, SSC స్కోర్‌లకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. దరఖాస్తుదారులు తమ అప్లికేషన్లను జులై 22 నుండి జులై 29 మధ్య అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్​ అయ్యి ఆన్‌లైన్‌లోనే అప్లికేషన్లు సబ్మిట్​ చేయాలి. అదనపు సమాచారం కోసం, 040-27077929కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement