Monday, October 14, 2024

Breaking: రేవంత్ రెడ్డి హెలికాప్టర్ లో సాంకేతిక లోపం

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హెలికాప్టర్ లో సాంకేతిక లోపం ఏర్పడింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రచారం చేసేందుకు హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి హెలికాప్టర్ లో సమస్య తలెత్తడంతో రోడ్డుమార్గంలో ఆయన బయల్దేరారు.

సాంకేతిక లోపం రావడంతో హెలికాప్టర్ ప్రయాణం రద్దు చేసుకున్నారు. రోడ్డు మార్గంలో ఆయన కామారెడ్డికి బయలుదేరారు. రోడ్డు మార్గంలో వెళ్తుండటంతో సభలకు ఆలస్యమయ్యే అవకాశముంది. కామారెడ్డి నియోజకవర్గంలో మూడు సభల్లో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement