Friday, May 3, 2024

Take oath for the Challenge – గ‌న్ పార్క్ వ‌ద్ద టెన్ష‌న్… రేవంత్ రెడ్డి అరెస్ట్ …

హైద‌రాబాద్ – గ‌న్ పార్క్ వ‌ద్ద ప్ర‌మాణం చేసేందుకు వ‌చ్చిన పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిని పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. మ‌ద్యం , న‌గ‌దు పంచ‌కుండా ఎన్నిక‌ల‌లో పోటీ చేద్దామ‌ని, అందుకు గ‌న్ పార్క్ వ‌ద్ద అమ‌ర‌వీరుల స్థూపం వ‌ద్ద ప్ర‌మాణం చేసేందుకు రావాల‌ని బిఆర్ఎస్ పార్టీకి స‌వాల్ చేశారు.. ఈ నేప‌థ్యంలో ప‌లువురు కీల‌క నేత‌ల‌తో గ‌న్ పార్క్ వ‌ద్ద‌కు రేవంత్ చేరుకున్నారు.. అయితే ఇక్క‌డ కార్య‌క్ర‌మం చేసేందుకు ఎటువంటి అనుమ‌తి లేదంటూ రేవంత్ ను పోలీసుల అడ్డుకున్నారు. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ నేత‌ల‌కు, పోలీసుల‌కు మ‌ధ్య తీవ్ర‌వాగ్వాదం జ‌రిగింది.. అనంత‌రం వారంద‌రిని అదుపులోకి తీసుకుని వివిద పోలీస్ స్టేష‌న్ ల‌కు త‌ర‌లించారు..రేవంత్ రెడ్డి సైతం అదుపులోకి తీసుకుని , అనంత‌రం వ‌దిలివేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement