Sunday, April 28, 2024

Suspense – సిఎల్పీ నేత ఎంపిక‌పై ఖ‌ర్గే, రాహుల్, డికె చ‌ర్చ‌లు… సాయంత్రానికి పేరు వెల్ల‌డి…

న్యూఢిల్లీ – తెలంగాణ సిఎల్పీ నేత పేరును నేటి సాయంత్రం ప్ర‌క‌టిస్తామ‌ని క‌ర్నాట‌క ఉప ముఖ్య‌మంత్రి డి కె శివ‌కుమార్ వెల్ల‌డించారు. హైద‌రాబాద్ లో జ‌రిగిన సిఎల్పీ స‌మావేశం అభిప్రాయాలు… ఢిల్లీలో సీనియ‌ర్ నేత‌లు ఉత్త‌మ్, భ‌ట్టి, కోమ‌టి రెడ్డి త‌దిత‌రులతో జ‌రిపిన చ‌ర్చ‌ల వివ‌రాల‌ను కాంగ్రెస్ అధిష్టానానికి అందించాన‌ని వివ‌రించారు.. ప్ర‌స్తుతం త‌న నివేదిక‌పై ఎఐసిసి అధ్య‌క్షుడు ఖ‌ర్గే , తెలంగాణ వ్య‌వ‌హారాల ఇన్ ఛార్జీ మాణిక్ రావు ఠాక్రే కెసి వేణుగోపాల్, రాహుల్ గాంధీ పరిశీలిస్తున్నార‌ని, నేటి సాయంత్రానికి సిఎల్పీ లీడ‌ర్ పేరును వెల్ల‌డించే అవ‌కాశం ఉంద‌న్నారు..

డికెతో ముగిసిన ఉత్త‌మ్ భేటి..
కర్ణాటక ఉపముఖ్యమంత్రి, తెలంగాణ ఎన్నికల పరిశీలకుడు డీకే శివకుమార్ తో ఉత్తమ్ మధ్యాహ్నం భేటీ అయ్యారు. మేఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై దాదాపు గంటన్నర పాటు ఇద్దరూ చర్చించారు. మీటింగ్ తర్వాత బయటకు వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డిని మీడియా ప్రతినిధులు చుట్టుముట్టారు. దీంతో ఉత్తమ్ క్లుప్తంగా మాట్లాడారు. పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను హైకమాండ్ కు వివరించినట్లు చెప్పారు. సీఎం ఎంపిక బాధ్యత హైకమాండ్ దేనని, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణస్వీకారం చేయబోతున్నారని మీడియా అడిగిన ప్రశ్నకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ‘నో కామెంట్’ అంటూ వెళ్లిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement