Tuesday, May 7, 2024

Thungathurthi : కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు లో సస్పెన్స్?

మోత్కూర్, నవంబర్ 9 (ప్రభ న్యూస్) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంకు ఓ విశిష్టత ఉంది.నియోజకవర్గంలో 9 మండలాలకు గాను 6 మండలాలు సూర్యాపేట ,2 మండలాలు యాదాద్రి భువనగిరి ,1 మండలం నల్గొండ జిల్లాలో ఉన్నాయి.కాగా తుంగతుర్తి కాంగ్రెస్ అభ్యర్ధి ఖరారు కాకపోవడంతో నియోజకవర్గం కాస్త రాష్ట్ర స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇక్కడ బి ఆర్ ఎస్ అభ్యర్థి ,సిట్టింగ్ ఎమ్మెల్యే డా.గాధరి కిశోర్ కుమార్ నేడు నామినేషన్ దాఖలు చేయగా,బీజేపీ అభ్యర్థి రేపు నామినేషన్ల చివరిరోజున దాఖలు చేయనున్నారు. ఇంత వరకు కూడా కాంగ్రెస్ అభ్యర్ధి ని అధిష్టానం ప్రకటించకపోవడంతో నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు,శ్రేణులు,అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.రాష్ట్ర స్థాయిలో నామినేషన్ల జోరు..ప్రచార హోరు కొనసాగుతుండగా …ఇక్కడ మాత్రం అధికార పార్టీకి ప్రధాన పోటీదారైన కాంగ్రెస్ అభ్యర్ధి ప్రకటన రాకపోవడంతో శ్రేణుల్లో అయోమయం నెలకొంది. అభ్యర్థి తెలియకుండానే హస్తం గుర్తుకు ఓటేయాలని కార్యకర్తలు నియోజకవర్గంలో ప్రచారం సైతం నిర్వహిస్తున్నారు.కేవలం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ని సూర్యాపేట, తుంగతుర్తి, మిర్యాలగూడ సీట్ల విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఆలస్యంతో అధికార పార్టీకి అదునుగా మారనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement