Saturday, March 2, 2024

Sucide – ఇద్దరు పిల్లలు, తల్లి ప్రాణాలు తీసిన ఆన్ లైన్ మొబైల్‌ గేమ్‌

చౌటుప్పల్‌ – ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర ఘటన నల్గొండ జిల్లా చౌటుప్పల్‌ మల్లికార్జున నగర్‌లో చోటు చేసుకున్నది. ఇద్దరు కుమారులను సంపులో తోసింది. ఆ తర్వాత తల్లి సైతం ఆత్మహత్య చేసుకున్నది. మృతులు రాజేశ్వరి (28) మృతులు అనిరుధ్‌ (5), హర్షవర్ధన్‌ (3)గా గుర్తించారు.

మొబైల్‌లో గేమ్‌ ఆడడంతో రూ.8లక్షల వరకు నష్టపోయినట్లు సమాచారం. ఈ క్రమంలో మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తున్నది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement