Wednesday, May 22, 2024

TS : బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌

బాసర, ఏప్రిల్ 16( ప్రభ న్యూస్) నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీలో మరో విద్య కుసుమం నేలరాలింది. హాస్టల్ గదిలో విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. యూనివర్సిటీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా తోగుట మండలం బండారుపల్లి కి చెందిన బుచ్చుక అరవింద్ యూనివర్సిటీ లో పియుసి రెండవ సంవత్సరం విద్యనభ్యసిస్తున్నాడు.

- Advertisement -

వ్యక్తిగత కారణాలతో హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు గమనించిన తోటి విద్యార్థులు యూనివర్సిటీ అధికారులకు సమాచారం అందించడంతో సెక్యూరిటీ సిబ్బంది స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు ఆస్పత్రి వైద్యులు గుర్తించారు. విద్యార్థి మృతదేహాన్ని నిర్మల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విద్యార్థి తల్లిదండ్రులకు యూనివర్సిటీ అధికారులు సమాచారం అందించారు. ఈనెల 18 నుండి పియుసి2 విద్యార్థులకు ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో ఒత్తిడికి గురై విద్యార్థి మృతి చెందాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి?. కాగా, విద్యార్థి మృతి పై యూనివర్సిటీ ఇంచార్జ్ వైస్ ఛాన్సర్ వెంకటరమణ సంతాపం వ్యక్తం చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement