Monday, May 6, 2024

ఈజీగా డ్రైవింగ్ నేర్చుకునేందుకు స్టిమ్యులేటర్​ ఎంతో బెస్ట్ : మంత్రి పువ్వాడ‌

ఖమ్మం: డ్రైవింగ్‌లో ఉత్తమ మెళుకువలు, సులభమైన పద్ధతిలో నేర్పేందుకు డ్రైవింగ్ సిమ్యులేటర్లు ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం నగరంలోని కృష్ణా కార్ డ్రైవింగ్ స్కూల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన డ్రైవింగ్ సిమ్యులేటర్లను మంత్రి ఇవ్వాల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ విధానం డ్రైవింగ్ శిక్షణ పొందడానికి చాలా సులభమైన పద్ధతని, సాంకేతికతను ఉపయోగిస్తూ డ్రైవింగ్ ను తేలిగ్గా నేర్చుకోవచ్చని అన్నారు. కార్లు, ట్రక్కులు, బస్సులు మొదలైన వాహనాలు భయం లేకుండా నేర్చుకోవడానికి ఈ విధానం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అసలు అనుభవం లేని డ్రైవర్ శిక్షణను సిమ్యులేటర్ ద్వారా విజయవంతంగా పూర్తి చేయొచ్చని వివరించారు. కార్యక్రమంలో నిర్వహకులు పాలకుర్తి కృష్ణ, మేయర్ పునుకొల్లు నీరజ, ఎ.ఎం.సి. చైర్మన్ లక్ష్మి ప్రసన్న, సుడా చైర్మెన్ విజయ్ కుమార్, కార్పొరేటర్ పాకాలపాటి విజయ, నాయకులు మజీద్, ముజాహిద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement