Wednesday, April 24, 2024

షీ-టీమ్, జెండర్ ఈక్వాలిటీ.. 2k, 5k రన్ ప్రచార ర‌థం ప్రారంభం

ఖమ్మం : మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా షీ-టీమ్ లు పనిచేస్తున్నాయని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. మహిళల భద్రత, లింగ సమానత్వం గురించి అవగాహన కల్పించేందుకు ఖమ్మంలో షీ-టీమ్స్ రన్ ప్రచార రథాన్ని పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ తో కలసి మంత్రి పువ్వాడ జెండా ఊపి ప్రారంభించారు. వీ డీ ఓ స్ కాలనీలోని మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. సుస్థిరమైన రేపటి కోసం ఈ రోజు లింగ సమానత్వం’ అనే థీమ్‌కు అనుగుణంగా, ఖమ్మం పోలీస్ శాఖ షీ-టీమ్‌ ఆధ్వర్యంలో జెండ‌ర్ ఈక్వాలిటీ 2కే, 5కే ర‌న్‌ను నిర్వ‌హించ‌నున్నారని తెలిపారు.

మార్చి 27వ తేదీన ఉద‌యం 6:00 గంట‌ల‌కు ఖమ్మం పటేల్ స్టేడియం నుండి లకారం పార్క్‌ వరకు RUN కొనసాగుతుందని తెలిపారు. మ‌హిళ‌ల ర‌క్ష‌ణ కోసం అనేక కార్య‌క్ర‌మాలు అమ‌లుచేస్తున్న తెలంగాణ ప్రభుత్వం, మ‌హిళ‌ల‌కు నిరంత‌రం ర‌క్ష‌ణ క‌ల్పిస్తుందని ఈ సందర్భంగా అన్నారు. అనంతరం మహిళల భద్రత, లింగ సమానత్వంపై అవగాహన ప్రచార పోస్టర్ ను ఆవిష్కరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement