Saturday, May 4, 2024

MDK : బీజేపీలోకి సర్పంచుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు..

మనోహరబాద్, ప్రభాన్యూస్ : సాక్షాత్తు సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని పారిశ్రామిక వాడ మేజర్ పంచాయతీ కాళ్లకల్ సర్పంచ్, సర్పంచుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు నత్తి మల్లేష్ ముదిరాజ్, ఎంపిటిసి నత్తి లావణ్య మల్లేష్ ముదిరాజ్, కాంగ్రెస్ నాయకులు నరేష్ గుప్తా, నత్తి బాల్ రాజ్ ముదిరాజ్, కుమ్మరి నాగరాజు, ఆంజనేయులు, పలువురు నాయకులతో కలిసి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్, గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ సమక్షంలో శుక్రవారం బీజేపీలో చేరారు.

ఈసందర్బంగా సర్పంచ్ నత్తి మల్లేష్ ముదిరాజ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సర్పంచులకు, నాయకుల సమస్యలు చెప్పుకోవడానికి ఎమ్మెల్యే, సీఎం ఎప్పుడూ అందుబాటులో లేకపోతే నియోజకవర్గ సమస్యలు ఎలా పరిష్కారవుతాయని అన్నారు. అలాగే గ్రామాల అభివృద్ధి కోసం సర్పంచులు అప్పులు చేసి బిల్లులు రాకపోవడంతో సూసైడ్ చేసుకున్న సర్పంచుల కుటుంబీకులను పరామర్శించిన నాదుడే కరువైయ్యారన్నారు. ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ నాయకులు తూతూ మంత్రంగా అసంపూర్తితోనే పనిచేస్తున్నారని, ఇష్టం లేని సంసారం ఎక్కువ రోజులు నిలవదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షలకు పైగా ఉన్న ముదిరాజ్ లకు బీఆర్ఎస్ పార్టీలో గుర్తింపు లేకుండా పోయిందని, బీసీలకు టికెట్లు కేటాయించడంతోనే పార్టీలో బీసీలలో అసంపూర్తి మొదలైందని గజ్వేల్ లో ఎక్కువ శాతం ఉన్న బీసీ ఓటర్లు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి బీసీ నాయకుడు ఈటెల రాజేందర్ ను భారీ మెజారిటీతో గెలిపించి బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చేలా బీసీ వర్గం, ముదిరాజ్ కులస్థులం కృషి చేస్తామని తెలిపారు.


పేరుకే సర్పంచులం.. ప్రభుత్వంలో ఎలాంటి గుర్తింపు లేదు..
గ్రామాల్లో పేరుకు మాత్రమే సర్పంచులం అని గ్రామస్థులకు కనీసం పెన్షన్ కూడా ఇప్పించే అధికారం కూడా లేదని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారని, బీసీ బంధు, దళిత బంధు, గృహ లక్ష్మి పథకాలు వినడమే తప్ప ఒక్క నిరుపేద కుటుంబీకులకు కూడా సర్పంచులం, ఎంపిటిసిలం ఇవ్వలేకపోయామన్నారు. అధికార పార్టీలో ఉండగా అధికార పార్టీలో ఉన్న సర్పంచ్ లను అధికారులు ఏ చిన్న తప్పు దొర్లినా దీనికి సర్పంచ్ లను బాధ్యులుగా చేసి సర్పంచ్ లను సస్పెండ్ చెయ్యడంతో ప్రజల్లో చులకన భావం ఏర్పడిందని సర్పంచ్ నత్తి మల్లేష్ ముదిరాజ్ అవేదన వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement