Monday, April 29, 2024

TS: సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం ను ప్రారంభించిన సభాపతి పోచారం

సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం కు సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి శ్రీకారం చుట్టారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని బాన్సువాడ గ్రామీణ మండలం జక్కలదాని తాండా ప్రాధమిక పాఠశాలలో “ముఖ్యమంత్రి అల్పాహారం” పథకాన్ని ఈరోజు ప్రారంభించి‌ విద్యార్థులతో కలిసి అల్పాహారాన్ని తినీ ఈ పథకానికి సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి శ్రీకారం చుట్టారు.
ఈసందర్భంగా సభాపతి పోచారం మాట్లాడుతూ… ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ఈరోజు నుంచి ప్రారంభిస్తున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పథకాన్ని ప్రవేశపెట్టినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 27,000 పాఠశాలలో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న ఇరవై లక్షల మంది విద్యార్ధులకు ముఖ్యమంత్రి అల్పాహార పథకం అందుతుందన్నారు. నియోజకవర్గంలోని ఒక్క పాఠశాలలో ప్రారంభిస్తారు. దసరా సెలవుల తరువాత నుండి అన్ని పాఠశాలలో మొదలవుతుందన్నారు. ప్రతిరోజూ ఉదయం 8.45 గంటలకు విద్యార్థులకు అల్పాహారాన్ని అందిస్తారన్నారు. ప్రతిరోజూ మెనూ ప్రకారం అల్పాహారం ఉంటుందన్నారు. ఉపాధ్యాయులు బాధ్యత వహించి మంచి వంట సరుకులను వాడే విదంగా పర్యవేక్షించాలన్నారు. పదార్థాలను రుచిగా వండితే పిల్లలు తృప్తిగా, కడుపు నిండా తింటారన్నారు. విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ నిత్యం ఉండాలనీ సభాపతి స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement