Thursday, May 2, 2024

Sonia Message – ప్రజా తెలంగాణ సాధిద్దాం – అమరుల కల నిజం చేద్దాంః సోనియా గాంధీ వీడియో సందేశం

నిజాయితీ ప్రభుత్వం అందిస్తాం
అమ్మలా చూశారు.. కృతజ్ఞురాలిని
నా జీవితం మీకే అంకితం
కాంగ్రెస్ నేత సోనియా గాంధీ వీడియో సందేశం

“తెలంగాణ తల్లి అమరుల పుత్రుల కల నెరవేరేలా చూడాలని ఉంది. దొరల తెలంగాణను ప్రజా తెలంగాణగా మార్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ కలలను నిజం చేసుకోండి. మీకు నిజమైన, నిజాయితీ ప్రభుత్వాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు నన్ను సోనియా అమ్మా అని పిలిచి అపారమైన గౌరవం ఇచ్చారు. నన్ను తల్లిలా చూసుకోండి.. ఈ ప్రేమ, గౌరవానికి నేను ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞురాలిని. ఎప్పటికీ మీకు అంకితమై ఉంటాను” అని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, ఎంపీ సోనియా గాంధీ అన్నారు. మరి కొన్ని గంటల్లో తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగియనున్న తరుణంలో ఆమె తెలంగాణ ప్రజలకు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తన ఆరోగ్యం సహకరించని కారణంగా నేరుగా ప్రచారంలోకి రాలేక పోయానని చెప్పారు. తెలంగాణ మార్పును ఆకాంక్షిస్తూ, మంచి పరిపాలన అందించేందుకు కాంగ్రెస్ పార్టీ మీ ముందుకు వచ్చిందన్నారు. తెలంగాణలోని ప్రతి ఒక్కరూ.. ఈసారి తమ శక్తినంతా వినియోగించి మార్పు తీసుకురావాలని అభ్యర్థించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement