Tuesday, February 20, 2024

బ్రహ్మాకుమారీస్‌.. అమృతగుళికలు ( ఆడియోతో…)

స్వయంను అహం నుంచి విడదీయండి. మనం మౌనంగా కూర్చొని ఉన్నప్పుడు మనలో ఆలోచనలు రూపుదిద్దుకోవటం గమనిస్తాము. జ్ఞాపకాలు, ఆకాంక్షలకు, ఊహలకు మనసులో చిత్ర రూపాన్నిఇచ్చి వాటి ప్రభావమనే సుడిగుండములో మన మనసు పడిపోవడం గమనిస్తాం. ఇలా జ రిగినప్పుడు మన చుట్టూ ఉన్న వాస్తవాలకు దూరం అయి, ఆలోచనలు లేక ఊహ చిత్రపు ఉచ్చులో స్వయాన్ని చిక్కించుకుంటాము. ఈ విధంగా మనలో ఉన్న అహం పనిచేస్తుంది. మన ఆలోచనలతో లేక ఊహ చిత్రంతో మనసును జోడింపచేసి అవే మనముగా మన ఆకాంక్షలే మన గుర్తింపు అనే భావనలలో ఉన్నప్పుడు మనలో అహం ఉన్నదని అర్థం చేసుకోవాలి. ఈ రోజు నేను అహం నుంచి స్వయాన్ని స్వతంత్రముగా ఉంచుతాను.

-బ్రహ్మాకుమారీస్‌…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement