Saturday, May 4, 2024

దుమాలలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ పై కలెక్టర్ కీలక ఆదేశాలు

రాజన్నసిరిసిల్ల జిల్లా దుమాల గ్రామంలో నిర్మాణంలో ఉన్న చిట్టివాగు, పెద్ద చెరువు ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులను వేగంగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఎల్లారెడ్డి పేట మండలం దుమాల గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో అభివృద్ధి పనులను పరిశీలించారు. చిట్టివాగు, పెద్ద చెరువు ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులను మొదట పరిశీలించారు. అనంతరం నర్సరీ, వైకుంఠ ధామం, గ్రామ పంచాయితీ కంపోస్టు షెడ్ నిర్వహణ తీరును పరిశీలించారు. నిర్వహణను మెరుగుపరిచేందుకు గ్రామ పంచాయితీ సిబ్బందికి జిల్లా కలెక్టర్ పలు సూచనలు చేశారు. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రం ను పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… గ్రామంలో పెండింగ్ పనులపై ఆయా అధికారులతో సమీక్ష నిర్వహించి వేగవంతం చేయాలని ఆదేశించామని అన్నారు. ఈ రోజే గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ను ప్రారంభించామని జిల్లా కలెక్టర్ తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా, కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర గ్రేడ్ A రకం రూ. 1960 , సాధారణ రకం రూ.1940 కు ధాన్యం కొంటామనీ తెలిపారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు.  అకాల వర్షాలకు జిల్లాలో జరిగిన పంట నష్టం ను లెక్కిస్తున్నామని , మదింపు పూర్తయ్యాక నష్టం వివరాలనూ ప్రభుత్వం కు నివేదిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement