Wednesday, May 1, 2024

Transfers – రామగుండం కమిషనరేట్ పరిధిలో 28 మంది ఎస్ఐల బదిలీలు..

పెద్దపల్లి (ప్రభ న్యూస్) రామగుండం కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న 28 సబ్ ఇన్స్పెక్టర్ లను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్
రెమారాజేశ్వరి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. చెన్నూరులో పనిచేస్తున్న సౌజన్యను గోదావరిఖని వన్ టౌన్ కు, మంచిర్యాల ట్రాన్స్పోర్ట్ లో పనిచేస్తున్న లచ్చన్నను రామగుండం సి ఎస్ బి కి, సైబర్ క్రైమ్ లో పనిచేస్తున్న మల్లేష్ ను పెద్దపల్లి ఎస్సై 2 గా, బెల్లంపల్లి వన్ టౌన్ లో పనిచేస్తున్న రాజమణిని సి ఎస్ బి రామగుండంకు, శ్రీరాంపూర్ మహిళా పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సంధ్యారాణిని సి ఎస్ బి పెద్దపల్లికి, జైపూర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న గంగరాజు గౌడ్ ను బసంత నగర్ ఎస్సై 2 గా, వి ఆర్ లో ఉన్న స్వరూప్ రాజును సిసిఎస్ పెద్దపల్లికి, కోటపల్లి లో పనిచేస్తున్న వెంకటస్వామిని గోదావరిఖని ఒకటవ పోలీస్ స్టేషన్కు, మంచిర్యాలలో పనిచేస్తున్న సురేష్ ను కోటపల్లికి, మంచిర్యాల విఆర్ఓ ఉన్న సౌమ్యను మందమర్రి పిసిఆర్ కు, సిఎస్బి రామగుండం లో ఉన్న రమేష్ ను బెల్లంపల్లి వన్ టౌన్ కు, సి సి ఆర్ బి లో పనిచేస్తున్న మౌనికను సిఎస్బి రామగుండంకు, వి ఆర్ లో ఉన్న అనూషను సిసిఆర్బి రామగుండంకు, మంచిర్యాలలో పనిచేస్తున్న తహసుద్దీన్ ను కెసిఆర్ మందమర్రికి, టాస్క్ ఫోర్స్ మంచిర్యాలలో పనిచేస్తున్న మధుసూదన్ ను మంథని కి, బదిలీ అయ్యారు.

మంథని ముత్తారంలో పనిచేస్తున్న రాములను కమాన్పూర్, కమాన్పూర్ లో పనిచేస్తున్న షేక్ మస్తాన్ ను విఆర్ కు, మంచిర్యాల ట్రాఫిక్ లో పనిచేస్తున్న శివకేశవులను సిసిఎస్ పెద్దపల్లికి, మంచిర్యాల మహిళా పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న రాజేంద్రప్రసాద్ను పిసిఆర్ రామగుండంకు, తాండూరు లో పనిచేస్తున్న మధుసూదన్ ను సిసిఎస్ పెద్దపల్లికి, రామకృష్ణ పూర్ లో పనిచేస్తున్న ఫరీద్ ను గోదావరిఖని టూ టౌన్ కు, శ్రీరాంపూర్ లో పనిచేస్తున్న సుగుణాకర్ ను విఆర్ రామగుండంకు, చెన్నూరులో పనిచేస్తున్న చంద్రశేఖర్ ను గోదావరిఖని టూ టౌన్ కు, గోదావరిఖని వంటల్లో పనిచేస్తున్న శైలజను శ్రీరాంపూర్ మహిళా పోలీస్ స్టేషన్కు, రామగుండం ట్రాఫిక్ లో పనిచేస్తున్న రాజేందర్ ను శ్రీరాంపూర్ మహిళా పోలీస్ స్టేషన్కు, ట్రాఫిక్ రామగుండంలో పనిచేస్తున్న నాగరాజును సిఎస్బి మంచిర్యాలకు, సి ఎస్ బి రామగుండంలో పని చేస్తున్న రమేష్ ను టాస్క్ ఫోర్స్ మంచిర్యాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement