Friday, May 3, 2024

చంచల్ గూడ జైలు నుండి షర్మిల విడుదల

వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సాయంత్రం చంచల్ గూడ జైలు నుండి విడుదలయ్యారు. నాంపల్లి కోర్టు వైఎస్ షర్మిలకు ఇవాళ బెయిల్ మంజూరు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు పూచీకత్తులు సమర్పించడంతో చంచల్ గూడ జైలు నుండి వైఎస్ షర్మిలను విడుదల చేశారు జైలు అధికారులు. బయటకు వచ్చిన అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement