Thursday, February 29, 2024

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ కి బాంబు బెదిరింపు

శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు మెయిల్‌ వచ్చింది. ఈ ఘటన సోమవారం ఉదయం జరగగా.. విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఎయిర్‌పోర్ట్‌లో బాంబు పెట్టినట్లు ఓ వ్యక్తి కంట్రోల్‌ రూమ్‌కు మెయిల్‌ ద్వారా సమాచారం ఇచ్చాడు. దీంతో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో సీఐఎస్ఎఫ్ , స్థానిక పోలీసులు ఎయిర్‌పోర్టు మొత్తం తనిఖీలు నిర్వహించారు. చివరకు బాంబు లేదని అధికారులు తేల్చారు. మెయిల్‌ ఆధారంగా దుండగుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement